W.G: భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన బుధవారం గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం (PCPNDT) అమలుపై కమిటీ సభ్యులతో సమీక్ష జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. నాగరిక సమాజంలో ఆడ, మగ తేడా లేదని, పురుషుల కంటే దీటుగా మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, చేయించుకున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.