MBNR: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ దేవుని గుట్టపై ఉన్న కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక శోభ నెలకొంది. నేటి సాయంత్రం పట్టణానికి చెందిన మహిళలు, గౌడ కులస్తులు పెద్ద ఎత్తున దేవాలయం వద్దకు చేరుకుని కార్తీక దీపాలను వెలిగించారు. అంతకుముందు కంఠమహేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.