ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో ఈరోజు పౌర్ణమి సందర్భంగా మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి త్రిపుర భైరవేశ్వర నంద స్వామీజి, 24 మంది అఘోరాలు నాగ సాధువులతో విచ్చేస్తున్నట్లు స్వామీజీ తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.