విశాఖ: సింహాచలం పరిధిలోని అడవివరం, వెంకటాపురం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలపల్లి పరిధిలో సుమారు 12 వేల వరకు ఇళ్లు ఉన్నాయి. సింహాచలం దేవస్థానం, ఆయా గ్రామాలకు యాజమాన్య హక్కులు ఉన్నా క్రమబద్ధీకరణ అవ్వలేదు. దీంతో నివాసితులు తమ ఇళ్లను అమ్మడం, కొత్తవారు కొనడం లేదా మరమ్మతు చేయడం కష్టతరంగా మారింది. ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు