KNR: జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి గ్రామపంచాయతీ మల్టీపర్పస్ కార్మికుడు పుర్మా సంపత్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఐదురోజుల క్రితం ఆయనకు హై బీపీ రావడంతో కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. కాగా, మృతుడికి గ్రామపంచాయతీ తరఫున రూ.10వేల ఆర్థిక సహాయాన్ని ఎంపీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు.