SRD: మండల కేంద్రమైన కంగ్టి మార్కెట్ గోదాంలో గురువారం సోయా కొనుగోలు కేంద్రాన్ని PACS చైర్మన్ మారుతి రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయా పంటకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ. 5328 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. మండలంలోని రైతులు తమ పట్టా పాసు పుస్తకం వెంట తెచ్చి టోకెన్లు పొందాలని సూచించారు.