VSP: పీ.హెచ్.సీ.ల అంబులెన్సులకు డ్రైవర్లు కొరత ఉందని దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు కే కోటపాడు జడ్పీటీసీ అనురాధ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు గురువారం జడ్పీ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించాలని పలువురు సభ్యులు విజ్ఞప్తి చేశారు.