WNP: కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ గేయాలాపన చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో వందేమాతరం గేయాలాపన చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.