GNTR: తెనాలి 1-టౌన్ పోలీసులు నాజర్పేటలో వ్యభిచార గృహంపై ఇవాళ దాడులు చేసి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ విజయ్ కుమార్ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ బృందం రూ. 500 నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.