సత్యసాయి: కనగానపల్లి మండలం సీఎన్ కోట గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురైంది. సాయంత్రం విద్యార్థులను తీసుకెళ్తుండగా తగరకుంట వద్ద రహదారి పక్కన ఉన్న రాయిని ఢీకొని ఆగిపోయింది. బస్సులో 60 మంది విద్యార్థులు ఉండగా ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.