GNTR: జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీసులో జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న ఇంఛార్జ్ జిల్లా జడ్జి సత్యవతి మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన వారికి నిస్సందేహంగా ఉచిత న్యాయ సహాయం అందించాలనేదే తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. పౌరులందరూ తమ చట్టబద్ధమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.