కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ షాంపూ సాచెట్లు, సబ్బుల విక్రయం, వాడకాన్ని హైకోర్టు పూర్తిగా నిషేధించింది. పంబా నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిషేధం నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే మండలం-మకరవిళక్కు సీజన్ నుంచి అమలులోకి వస్తుంది. రసాయన కుంకుమ అమ్మకాలు కూడా నిషేధించినట్లు కోర్టు తెలిపింది.