ADB: నార్నూర్ మండలంలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని శుక్రవారం అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ ఓ ప్రకనటలో తెలిపారు. స్థానిక సబ్ స్టేషనులో 33/11 కేవి స్తంభాల మరమ్మతుల కారణంగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కరెంటు నిలిపివేయనున్నామని పేర్కొన్నారు. దీంతో విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.