TG: హైదరాబాద్లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 85వ సదస్సు జరగనుంది. భువనేశ్వర్లో జరుగుతున్న 84వ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్లో సదస్సు నిర్వహించాలని ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే.