SRPT: గత మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన గ్రామ పంచాయతీ కార్మికుడు మొలుగూరి నరసింహారావు కుటుంబాని తోటి కార్మికులు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్మికుల ద్వారా సేకరించిన రూ.23 వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు.