WGL: బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రేగొండ మండల సీఐ కరుణాకర్ అన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన బాల్య వివాహాల అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. బాలికల రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్జీవో ప్రతినిధి కోమల ఉన్నారు.