నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ శుక్రవారం టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమీక్ష నిర్వహించారు. భవన యజమానులు నిర్దేశించిన ప్లాన్ ప్రకారం కట్టుబడులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణ సమయంలో పిల్లర్ల దశలోనే లోపాలను గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.