NTR: విజయవాడ సత్యనారాయణపురంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చలానాలు విధించడమేకాకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులను గుర్తించి, వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం, లైసెన్స్ లేని వాహనదారుల వాహనాలు స్వాధీనం చేసుకొని, తక్షణం డ్రైవింగ్ లైసెన్సులకు పోలీసులు అప్లై చేయించారు.