MBNR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ (AHT), బాండెడ్ లేబర్ ఆపరేషన్స్’ పై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఎస్పీ డీ.జానకి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ తెలంగాణ సంస్థ సహకారంతో జరిగిన ఈ వర్క్‌షాప్ సీనియర్ సివిల్ జడ్జ్ ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా కృషి చేయాలన్నారు.