SRCL: జిల్లా కేంద్రానికి చెందిన కొంపల్లి వీణ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంది. ఎమ్మెస్సీ గణితం విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022- 2023 సంవత్సరం బ్యాచ్లో అత్యధిక మార్కులు సాధించింది. ఈరోజు జరిగిన శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో వీణకు బంగారు పతకాన్ని గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు.