PDPL: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. NTPC పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మంచి ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో మంచి నడవడికతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో NTPC-SIఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.