KNR: విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురు, శుక్రవారాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళోత్సవ్ పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు నాలుగు ప్రథమ బహుమతులు సాధించారు. ఇందులో రెండు స్థానాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, మరో రెండు స్థానాలు ప్రైవేటు విద్యార్థులు సాధించారు. మొత్తం 12 రంగాల్లో పోటీలు నిర్వహించగా అందులో నాలుగు రంగాల్లోనూ KNR విద్యార్థులే ఉన్నారు.