SRCL: వేములవాడ భీమన్న ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో 17వ రోజు రాత్రి కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్ చార్యులు, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.