ADB: జిల్లాలో పని చేయడానికి, నేర్చుకోవడానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ రాజార్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ శిక్షణలో భాగంగా జిల్లా పర్యటన పూర్తి చేసుకున్న అధికారుల బృందానికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ పకడ్బందీగా జరుగుతోందని తెలిపారు.