NLG: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప బ్రెయిన్ స్ట్రోక్తో శుక్రవారం ఉదయం హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందగా సాయంత్రం నల్గొండలోని ఆమె స్వగృహానికి పార్థివ దేహాన్ని తీసుకువచ్చారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆమె పార్థివ దేహానికి పూల మాలలతో నివాళులర్పించారు.