PDPL: అర్ధరాత్రి దొంగల్లాగా దారి మైసమ్మ గుడులను తొలగించి మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ, సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని హిందూ ఐక్యవేదిక నాయకుడు అయోధ్య రవీందర్ డిమాండ్ చేశారు. రామగుండం ప్రాంతంలోని సుమారు 50 దారి మైసమ్మ గుడులను అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరిట అర్ధరాత్రి కూల్చడమేంటనీ ప్రశ్నించారు.