PDPL: సైబర్ నేరాలపై అవగాహన అవసరమని, అప్పుడే వాటి బారిన పడకుండా ఉండవచ్చని గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ తెలిపారు. ఎన్టీపీసీ కృష్ణానగర్ కాలనీ అపార్ట్మెంట్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ మోసాలు జరిగే తీరుపై వివరించారు. సైబర్ మోసాలకు గురవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అవగాహన కల్పించారు. మోసానికి గురైతే పోలీసులను సంప్రదించాలన్నారు.