ASF: జాతీయ కుటుంబ ప్రయోజనా పథకం కింద అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో అన్ని మండలాల MROలతో జాతీయ కుటుంబ ప్రయోజనా పథకం అమలు, మీ- సేవా ధ్రువపత్రాలు, సాదా బైనమా, భూభారతి దరఖాస్తుల పెండింగ్, PM జన్ మన్ ఇళ్ల నిర్మాణం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.