WGL: గీసుకొండ మండలం ధర్మారం సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు స్నేహితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. భోగి నవీణ్, కటకం కళ్యాణ్, బెంబిరె అరవింద్, బెంబిరె మహేష్ అనే నలుగురు స్నేహితులు 145 గ్రాముల ఎండు గంజాయి కొనుగోలు చేసి అమ్ముతుండగా, ధర్మారం చెరువుకట్ట వద్ద వారిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.