JN: చిల్పూర్ మండలం రాజవరం కేజీబీవీలో పాఠశాలలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలని అన్నారు. అనంతరం పరిశుభ్రత, డ్రగ్స్ నియంత్రణ, మహిళా సాధికారత, స్వచ్ఛ భారత్ వంటి అంశాలపై చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.