ATP: మంత్రి నారా లోకేష్‌ను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తికి చేరుకున్న మంత్రికి ఆమె వేంకటేశ్వర స్వామి చిత్రపటం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రితో కలిసి రోడ్డు మార్గంలో కళ్యాణదుర్గానికి బయలుదేరారు. రేపు పట్టణంలో కనకదాసు విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.