MBNR: హాస్టల్ విద్యార్థినులకు త్వరలోనే ఆధునిక లైబ్రరీ ఏర్పాటుచేసి అత్యుత్తమ పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్సీ, బీసీ బాలికల హాస్టల్స్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. వసతి, విద్యా, ఆహారం, సౌకర్యాల వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే సూచించారు.