మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘RT76′ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పేరును ఈ సినిమాకు ఖరారు చేసినట్లు సమాచారం. ఈనెల 10న మేకర్స్ అధికారికంగా సినిమా టైటిల్ ప్రకటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.