KMM: నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తిరుమలాయపాలెం మండలంలో మరోసారి తమ మానవత్వాన్ని చాటుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వివిధ కారణాల వల్ల మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్క కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.