ADB: విద్యార్థులు పౌష్టికాహారాన్ని తిని ఆరోగ్యంగా ఉండాలని సబ్ యూనిట్ అధికారి పవార్ రవీందర్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని కుమారి జిల్లా పరిషత్ పాఠశాలలో ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మధు సుధన్, గంగాసింగ్, వెంకటరమణ, శైలేందర్, లింగం పాల్గొన్నారు.