MDK: ఇంట్లోని చెత్తను బయట పారవేయకుండా తడి, పొడి చెత్తగా వేరుచేసి మున్నిపల్ సిబ్బందికి అందజేయాలని మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధు సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు తడి, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలను అందజేశారు.