VKB: సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) పేదలకు వరం లాంటిదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు, బంట్వారం మండలానికి చెందిన సుక్క లక్ష్మికి రూ. 1,28,000 చెక్కును మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోచారం వెంకటేశం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.