TG: వరంగల్లోని MGM ఆస్పత్రిలో రోగులను తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత పరామర్శించారు. ఈ క్రమంలో వరంగల్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఆస్పత్రిలో మందులు, సదుపాయాలు సరిగా లేవని మండిపడ్డారు. వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా ఫలితం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సమస్యలు తీరక.. ఇప్పుడూ తీరకపోతే ఎలా అని నిలదీశారు.