WG: నరసాపురం నుంచి చెన్నై మధ్య తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభం కానుండటం జిల్లా ప్రజలకు ఎంతో ఆనందదాయకమని రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద ఇవాళ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందేభారత్ ఎక్స్ప్రెస్ జిల్లాకు రావడానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ముఖ్యపాత్ర పోషించారన్నారు.