ADB: జిల్లా కేంద్రంలోని కొలం ఆశ్రమ పాఠశాలలో డాక్టర్ సర్ఫరాజ్ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి, హెల్త్ సూపర్వైజర్ సుభాష్, ప్రేమ్ సింగ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.