MBNR: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందూరు నగర పథ సంచలన్ ఆదివారం నిర్వహిస్తున్నట్లు నగర కార్యవాహ అరుగుల సత్యం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ హెచ్పీఎస్ పాఠశాల నుంచి సాయంత్రం 4.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే ఉపనగర సంచలన్ నిర్వహించినట్లు తెలిపారు