SKLM: బాహుదా నది పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తహసీల్దార్ ఎన్. వెంకటరావు ఆదేశాలతో శుక్రవారం అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వంతెన ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇసుక తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.