MDK: నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. లీలా గ్రూప్ ఛైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేదలకు ఉచితంగా మందులను అందజేశారు. మెదక్ నియోజకవర్గం పరిధిలో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్యం అందిస్తున్న డాక్టర్ మోహన్ నాయక్‌ను స్థానికులు అభినందించారు.