TG: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య(FATHI)కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్లో రేపటి అధ్యాపక సభకు అనుమతి నిరాకరించింది. ఎన్నికలు ఉన్నందున భద్రత కల్పించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో సభకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. అయితే అధ్యాపక సభకు వారం రోజుల తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.