అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లడంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు లేకుండా ఉద్యోగులు పని చేస్తుండడంతో మానసికంగా వారు కుంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో విమానాల సంఖ్యను ఫెడరేషన్ ఏవియేషన్ తగ్గించింది. దీంతో ప్రతి రోజు 2,68,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకెళ్లే 1800 విమాన సర్వీసులు ప్రభావితం కానున్నాయి.