AP: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల కైవల్య రెడ్డి అమెరికాలో నిర్వహించే ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణకు ఎంపికైంది. ఫ్లోరిడాలోని ‘టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్’ ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణకు ప్రపంచ వ్యాప్తంగా 36 దేశాల నుంచి వేలాది మంది పోటీ పడగా.. 150 మంది మాత్రమే అర్హత సాధించారు. వారిలో కైవల్య రెడ్డి ఉండటం విశేషం. ఈ శిక్షణ నాలుగేళ్లపాటు కొనసాగనుంది.