WNP: అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ మదనపూర్ మార్కెట్ ఐకేపీ కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతుల వివరాలు, కొనుగోలు చేసిన ధాన్యం సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలను అప్డేట్ చేయాలని ఆదేశించారు.