కోనసీమ: జగన్ మాట్లాడే అబద్దాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. ఇవాళ ఆయన రావులపాలెం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. రాష్టంలో తుఫాన్ కారణంగా అన్నదాతలు నష్ట పోతే, రైతుల పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన చేస్తున్నారని విమర్శించారు.