టెక్నాలజీతో పాటు సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జెనరేటివ్ AI సాయంతో నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వ్యాపార వెబ్సైట్లు, యాప్లు వేగంగా విస్తరిస్తున్నాయి. పండుగ షాపింగ్, జాబ్ సెర్చ్ సమయంలో మోసాలు మరింత పెరిగే అవకాశం ఉంది. నిజమైన సంస్థలు ఉద్యోగ ప్రక్రియలో ఎప్పుడూ డబ్బు అడగవని గుర్తుంచుకోవాలి’ అని సూచించింది.