BHNG: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో PRTU ఎల్లప్పుడూ ముందుంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో PRTU మండల శాఖ రూపొందించిన 2026 నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో PRTU రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, కార్యదర్శి బిక్షం తదితర నాయకులు పాల్గొన్నారు.